హైదరాబాద్: 28°C
వార్తలు

నిజ్జర్ హత్య.. కెనడా సంచలన వ్యాఖ్యలు

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం లేదని కెనడా పోలీసులు వెల్లడించారు. భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని నిర్థారించే ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఈ హత్యపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఈ కేసును విచారిస్తున్న డిప్యూటీ కమిషనర్ లిసా మోర్లాండ్ తెలిపారు. విచారణకు భారత ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని చెప్పారు.