హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా NIA సోదాలు

దేశవ్యాప్తంగా NIA సోదాలు నిర్వహిస్తోంది. తెలుగురాష్ట్రాలతో సహా మొత్తం 10 రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తోంది. ఈ సోదాల్లో పలు ఎలక్ట్రిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫత్ స్థాపించాలనే లక్ష్యంతో యువతను టార్గెట్ చేసి రాడికలైజేషన్ వైపు ఉగ్రవాద ముఠా మళ్లిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.