హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా డాక్టర్‌పై దాడి.. ఖండించిన ఐఎంఏ

ముంబైలో మహిళా డాక్టర్‌పై శివసేన(షిండే వర్గం) నేత రమేష్ మాత్రే దాడి చేయడాన్ని ఐఎంఏ ఖండించింది. ఈ దాడికి నిరసనగా గురువారం వైద్య సేవల బంద్‌కు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా 72 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. ఐసీయూలో సౌకర్యాల విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.