హైదరాబాద్: 28°C
వార్తలు

లైంగిక వేధింపులు.. సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేత

సత్యసాయి: లేపాక్షి మండలంలో మూడో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు దేవరాజుకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు. ఎంఈవో గంగప్ప ఉత్తర్వులను అధికారికంగా అందించారు. ఘటనపై సంబంధిత శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.