హైదరాబాద్: 28°C
వార్తలు

పంజాబ్ పోలీసుపై FBI ఆరోపణలు

పంజాబ్ పోలీసు అధికారిపై అమెరికా చెందిన దర్యాప్తు సంస్థ FBI సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాలోని భారతీయ కుటుంబాన్ని పంజాబ్‌లోని టాండా పీఎస్ SHO నాగ్రా వేధించినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు SHO నాగ్రాను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనపై విచారణకు DIG ఆదేశించారు. సమగ్ర నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని సూచించారు.