హైదరాబాద్: 28°C
వార్తలు

కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 15 మంది

మహారాష్ట్ర పుణె పింప్రి-చించ్వాడ్‌లో భారీ వర్షాలకు మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ శిథిలాల కింద 15 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పుణె, పింప్రి-చించ్వాడ్‌ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.