హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈవో

MLG: ములుగు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో బుధవారం విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధిక ఫీజులు వసూలు, పాఠశాల ఆవరణలోనే పుస్తకాల విక్రయం జరుగుతోందనే ఫిర్యాదులపై ఎంఈవో తిరుపతి, ప్లానింగ్ కోఆర్డినేటర్-1 శ్రీనివాస్ రెడ్డి రికార్డులు పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘన తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.