హైదరాబాద్: 28°C
వార్తలు

పండ్ల తోటలో నక్కిన ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో ఓ పండ్ల తోటలో నక్కిన ఉగ్రవాదని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ జాకిర్ ఘనీగా బలగాలు గుర్తించాయి. అతడికి పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధాలున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్ గురించి జమ్మూ పోలీసులు Xలో పోస్ట్ చేస్తూ.. 'మీరు పారిపోవచ్చేమో.. కానీ దాక్కోలేరు' అని ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు.