హైదరాబాద్: 28°C
వార్తలు

పాదయాత్ర నిర్వహించిన మాజీ మంత్రి బుగ్గన

NDL: డోన్ (మం) గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఆరోపించారు. ఆలయ పనులు ఆగిపోవడంతో వాటిని నిరసిస్తూ.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆయన వెంట భారీగా వైసీపీ నేతలు పాల్గొన్నారు.