హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కోట్లాది మంది గుండెల్లో నిలిచిన నేత వైయస్సార్

కృష్ణా: గుడివాడ వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్సార్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్సార్ ఒక నాయకుడు మాత్రమే కాదని, కోట్లాదిమంది ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత అని మాజీ మంత్రి కొడాలి నాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.