ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతోన్న ముంబైకు వాతావరణశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఆర్థిక నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ వానల కారణంగా పలు సరస్సులు అలుగుపారుతున్నాయి.
వార్తలు
ముంబైకి అతిభారీ వర్ష సూచన


