సత్యసాయి: గోరంట్లలో 1వ వార్డు ప్రజలు మూడు వారాలుగా తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్య, ఇరుకైన డ్రైనేజీ వల్ల వర్షపు నీరు ఇళ్ల ముందు చేరడం, రహదారి ఇరుకుగా ఉండటంతో నీటి ట్యాంకర్లు, ఇతర వాహనాలు రాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
గోరంట్లలో తాగునీటి కొరత


