హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విద్యార్థిపై ప్రిన్సిపల్‌ లైంగిక దాడి

నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో ఓ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌పై మాజీ విద్యార్థి లైంగిక దాడి ఆరోపణలు చేశాడు. టీసీ ఇస్తానంటూ ఇంటికి పిలిచి వేధించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతిఘటించే క్రమంలో ప్రిన్సిపల్‌కు గాయాలైనట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.