హైదరాబాద్: 28°C
వార్తలు

వసతి గృహంలో జిల్లా అధికారి తనిఖీ

MDK: సర్ధన బీసీ హాస్టల్‌ను మంగళవారం జిల్లా అధికారి ఉపేందర్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల పరిశుభ్రత, మెనూ ప్రకారం అందిస్తున్న భోజన వసతులపై వార్డెన్ స్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఇందులో హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.