హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి పట్టణంలోని గాంధీకట్ట నుంచి నంద్యాల రోడ్డుకు గతంలో ఉన్న మురికి కాలువపై పైపులు ఏర్పాటు చేసి చేపడుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పరిశీలించారు. ఈ రోడ్డుతో ప్రజలకు నంద్యాల రోడ్డుకు కనెక్టింగ్ మార్గం ఏర్పడి ప్రయాణ సమయం తగ్గనుందని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.