హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతు ఆశీర్వాద సభకు తరలి రావాలి'

KMM: చింతకాని మండలం జగన్నాధపురంలో ఈ నెల 10న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా నిధులు మంజూరు చేసిందని బుధవారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. సభకు ప్రజలు, రైతులు తరలిరావాలన్నారు.