హైదరాబాద్: 28°C
వార్తలు

బైక్‌పై వెళ్తే హెల్మెట్ నిర్లక్ష్యం చేయొద్దు

బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలిపే ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో బైక్‌పై వెళ్తోన్న ఒక వ్యక్తిపై అకస్మాత్తుగా కుక్కలు దాడి చేయగా.. బైకర్‌తో పాటు వెనుక కూర్చున్న మహిళ రోడ్డుపై పడిపోయారు. అయితే, బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించడంతో అతడి తల రోడ్డుకు బలంగా తగిలినా ప్రమాదం జరగలేదు. హెల్మెట్ ప్రాముఖ్యతను ఈ ఘటన మరోసారి తెలిపింది.