హైదరాబాద్: 28°C
వార్తలు

విరాళాల లెక్కింపు కేసులో కీలక విషయాలు..!

అయోధ్య రామాలయంలో విరాళాల లెక్కింపు సిబ్బంది దొంగతనం కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే కొందరు సిబ్బంది ఈ చేతివాటానికి పాల్పడ్డారు. మొదట 500 రూపాయలతో మొదలుపెట్టి, ఎవరూ గమనించకపోవడంతో క్రమంగా నోట్ల కట్టలను దొంగిలించారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు సొమ్ము దొంగిలించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.