హైదరాబాద్: 28°C
వార్తలు

విమానాశ్రయంలో తప్పిన ఘోర ప్రమాదం

ముంబయి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపై ఎయిర్‌ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ప్రమాదాన్ని నివారించేందుకు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ సూచనల మేరకు ఎయిర్‌ఇండియా విమానం టేకాఫ్‌ను విరమించుకుంది. దీంతో ఈ భారీ ప్రమాదం తప్పింది.