PLD: శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన వేల్పుల రామకోటమ్మ మృతి అనంతరం ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు శంకర కంటి వైద్యశాలకు దానం చేశారు. అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ సండ్రపాటి చలపతిరావు తెలిపారు. నేత్రదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచిన ఆ కుటుంబాన్ని అభినందిస్తూ, మరింత మంది నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఆమె లేకున్నా.. చూపు సజీవం!


