హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాల ప్రాజెక్ట్ తాజా నీటిమట్టం ఎంతంటే?

WNP: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (PJP) నీటిమట్టం బుధవారం ఉదయం 6 గంటలకు 316.36 మీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 5.729 టీఎంసీల పూర్తి నీటి నిల్వ ఉండగా, అందులో 2.022 టీఎంసీల లైవ్ స్టోరేజ్ ఉంది. ఇన్ ఫ్లో సున్నా కాగా, ఇతర అవసరాలకు 670 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 36 క్యూసెక్కులు కలిపి మొత్తం 706 క్యూసెక్కుల ఔట్ ఫ్లో సాగుతోందన్నారు.