హైదరాబాద్: 28°C
వార్తలు

వానాకాలం వచ్చినా కరువే.. నగరంలో 45% వర్షపాత లోటు

HYD: నగరంలో వానాకాలం ప్రారంభమై నెల దాటినా తీవ్ర వర్షపాత లోటు వేధిస్తోంది. నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడంతో జూన్‌లో 20-45% లోటు నమోదైంది. జులై మొదటి వారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎల్‌నినో, లానినా ప్రభావాలే ఇందుకు ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగినన్ని వర్షాలు లేకపోవడంతో జంట జలాశయాలతో పాటు మూసీ నది ఇంకా పొడిగానే ఉన్నాయి.