హైదరాబాద్: 28°C
వార్తలు

రామాయణం, భారతం మనకు పునాది: మోదీ

భారత్‌-ఇండోనేసియా మధ్య సంబంధాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు.. 29 కోట్ల మంది ఇండోనేసియా వాసులు కలిసి సృష్టించే సుసంపన్నతను ప్రపంచం వీక్షిస్తుందని  తెలిపారు. ఇరు దేశాల మధ్య వారధిలా సముద్రం నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, నలందా విజ్ఞాన సంపద మన బంధానికి పునాది అని పార్లమెంటు ప్రసంగంలో పేర్కొన్నారు.