హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 13న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

నిజామాబాద్ జిల్లాలో జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఈ మాత్రలు పంపిణీ చేస్తారన్నారు.