హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాల కాలువలో చెత్త.. ప్రజల ఆందోళన

GDWL: గద్వాల్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ సమీప జూరాల నీటి కాలువలో చెత్త వేయడంతో నీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. కాలువలో చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకుని, వెంటనే కాలువను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.