హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లికి వందనం' కోసం బ్యాంకు ఖాతాలు తప్పనిసరి'

ELR: జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో (ఐపీపీబీ) ఖాతా తెరిచి, ఎన్పీసీఐకి అనుసంధానించాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్రెడ్డి మంగళవారం తెలిపారు. జులై 10లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇతర వివరాలకు డీపీఎంయూ వీరబాబు (9502228533)ను సంప్రదించాలని ఆయన సూచించారు.