హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: దారిదోపిడి కేసును చేదించిన పోలీసులు

KNR: జమ్మికుంట మండలం కోరపల్లిలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం, ఇసుక అక్రమ రవాణా చెక్‌పోస్ట్ వద్ద విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్‌కు చెందిన రాచపల్లి ప్రశాంత్, సమ్మయ్య, రాజును అరెస్టు చేశారు. పోలీసులపై దాడిని వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడి చేసి అతని ద్విచక్ర వాహనాన్ని అపహరించరన్నారు.