NDL: నందవరం శ్రీ చౌడేశ్వరీ అమ్మవారు బుధవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అటు, అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వార్తలు
శోభాయమానంగా దర్శనమిచ్చిన చౌడమ్మ


