TG: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇవాళ ఇందిరాపార్క్ వద్ద 'సత్యాగ్రహ దీక్ష' చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం. 9ను రద్దు చేయాలని కోరారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలను సహించబోమని వెల్లడించారు.
వార్తలు
నేడు ఆర్. కృష్ణయ్య 'సత్యాగ్రహ దీక్ష'


