హైదరాబాద్: 28°C
వార్తలు

వారి కంటే మావోయిస్టులే బెటర్: డీజీపీ

TG: గంజాయి స్మగ్లర్ల ఆగడాలపై DGP సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. స్మగ్లర్లు చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్కూళ్లు, కాలేజీల పిల్లలకు చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలు ఇస్తూ జీవితాలను నాశనం చేస్తున్న సమాజ శత్రువుల కంటే మావోయిస్టులే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు.