KRNL: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు, 2026-27లో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. దరఖాస్తు గడువు జూలై 31 వరకు ఉండగా, ప్రవేశ పరీక్ష నవంబర్ 28న జరుగుతుందన్నారు.
వార్తలు
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


