హైదరాబాద్: 28°C
వార్తలు

'దివ్యాంగుల సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శం'

NDL: నంద్యాల జీవనజ్యోతి అంధుల పాఠశాలలో 70 మంది దివ్యాంగులకు మంగళవారం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఉచిత హీరో మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శమన్నారు. పెన్షన్‌లు, మోటార్ సైకిళ్లు, ఉపకరణాలు, ఉపాధి అవకాశాలతో దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఫిరోజ్ కొనియాడారు. నారాయణస్వామి, ఫాతిమా పాల్గొన్నారు.