KRNL: కోసిగి మండలం మధ్యమగట్టు సమీపంలోని కంపచెట్లలో పేకాట నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో మంగళవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,270 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ రెడ్డి వెల్లడించారు.
వార్తలు
కోసిగిలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్!


