హైదరాబాద్: 28°C
వార్తలు

మొక్కల కొరత లేకుండా చూడాలి: తుమ్మల

TG: ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రైతులకు మొక్కల కొరత లేకుండా సకాలంలో సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సాగుకు కీలకమైన డ్రిప్ పరికరాల పంపిణీ, సబ్సిడీ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.