హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు పోటెత్తారు. ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 86 వేల మందికి పైగా మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే, భూతాపం, వాతావరణ మార్పుల వల్ల ఐదు రోజులకే మంచులింగం కరిగిపోయిందని అధికారులు తెలిపారు. అయినా భక్తుల తాకిడి తగ్గలేదు. రిజిస్ట్రేషన్ లేని భక్తులు కూడా రావడంతో ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డుల కౌంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.