ఉత్తర భారతదేశంలో భారీ వర్షాల వల్ల హర్యానాలోని గురుగ్రామ్ అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వానలకు ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై ఓ భాగం కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. దీనివల్ల నర్సింగ్‌పూర్ వద్ద దాదాపు 8-10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, పోలీసులు అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
వార్తలు
భారీ వర్షాలు.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్


