హైదరాబాద్: 28°C
వార్తలు

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ ‘నావిగేషన్ బోయ్’

AP: బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరానికి భారీ నావిగేషన్ బోయ్ కొట్టుకొచ్చింది. చెన్నై పోర్టు వద్ద వాతావరణ సమాచారం కోసం ఏర్పాటు చేసిన ఈ రూ.70 లక్షల పరికరం, అలల ఉధృతికి కొట్టుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. స్థానిక మత్స్యకారుల సమాచారంతో స్పందించిన అధికారులు, చెన్నై అధికారుల విజ్ఞప్తి మేరకు ఆ నావిగేషన్ బోయ్‌ను లారీలో సురక్షితంగా తిరిగి చెన్నైకి తరలించారు.