హైదరాబాద్: 28°C
వార్తలు

'SIR' డిజిటలైజేషన్ పనులపై కలెక్టర్ తనిఖీ

సత్యసాయి: లేపాక్షి సచివాలయంలో ఎస్‌ఐఆర్ (SIR) నమోదు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.