హైదరాబాద్: 28°C
వార్తలు

అదంతా పెయిడ్ క్యాంపెయిన్: కేంద్రమంత్రి

ఇథనాల్ బ్లెండింగ్‌పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. ఇది పెయిడ్ క్యాంపెయిన్ అని ధ్వజమెత్తారు. E-20 పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే దానిలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేశారు. దేశం ఏటా ఇంధన దిగుమతుల కోసం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇథనాల్ కలపటం వల్ల రైతులకు రూ.45వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.