హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్‌

ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. ఆ దేశంలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకు మోదీ ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. భారత సంస్కృతి, విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందన్నారు. అలాగే ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.