భారత్-ఇండోనేషియా మధ్య బలమైన సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్ర ఘటన సమయంలో భారత్‌కు అండగా ఉన్నందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు చెప్పారు. భారత ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో అనడంపై మోదీ స్పందిస్తూ.. స్నేహితుల మధ్య కాపీ రైట్ ఉండవని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
వార్తలు
స్నేహితుల మధ్య కాపీ రైట్ ఉండదు: మోదీ


