మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల కారణంగా ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. చెట్లు కూలి మీద పడడంతో పలువురు గాయపడ్డారు. మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ముంబైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చింది. ఈ వరదల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రైల్వే ట్రాక్‌లు, రోడ్లు ధ్వంసమయ్యాయి.
వార్తలు
భారీ వర్షాలు.. 16 మంది మృతి


