MHBD: కురవి మండలం పెద్దతండాలో మంగళవారం నిర్వహించిన సీత్లా పండుగ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. సీత్లా పండుగ గిరిజనుల ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని, వారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని అన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, ఆటపాటల్లో పాల్గొన్నారు.
వార్తలు
'ప్రకృతిని ఆరాధించే పండుగే సీత్లా పండుగ'


