హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన భవనం.. ఆరుగురు మృతి

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి పడిన వర్షాలకు ఓ భవనం కూలి పక్కనున్న ఇళ్లపై పడటంతో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. భవనం కూలుతుందని భావించి తెల్లారగానే అక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్నబాధిత అక్తర్‌ కుటుంబం భావించింది. అంతలోనే మృత్యువు కబలించివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.