హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.3వేల కోట్ల లంచం.. అధికారికి మరణశిక్ష

చైనాలో మరో అవినీతి తిమింగళానికి అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. షిజాంగ్(టిబెట్) స్వయం పాలిత ప్రాంత ప్రభుత్వంలో వైస్ ఛైర్‌పర్సన్‌గా పని చేసిన వాంగ్ యాగ్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడిని దోషి తేల్చింది. అనంతరం శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.