భారీ వర్షాల కారణంగా గుజరాత్ భావనగర్‌లోని శత్రుంజి డ్యామ్ పూర్తిగా నిండి అలుగుపారుతోంది. డ్యామ్‌కు వరద ఉద్ధృతి పెరగడంతో అప్రమత్తమైన అధికారులు 59 గేట్లను ఒకేసారి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో డ్యామ్ పరివాహక, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గేట్లన్నీ ఒకేసారి తెరిచిన నేపథ్యంలో జలకళతో ఉట్టిపడుతున్న డ్యామ్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వార్తలు
నిండిన డ్యామ్.. 59 గేట్లు ఎత్తివేత


