హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్ధృతంగా నది.. కొట్టుకుపోయిన పశువులు

ఒడిశా బలాంగిర్ జిల్లాలో లాంత్ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నది ఉపొంగడంతో 120కిపై పశువులు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న NDRF బృందాలు నదిలోకి వెళ్లి పశువులను, వాటి కాపరులను రక్షించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. NDRF బృందాల కృషిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.