హైదరాబాద్: 28°C
వార్తలు

స్కూల్‌లో స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

MDK: పెద్దశంకరంపేట మండలం తిరుమలాపూర్ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను జూలై 8, 9 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. 6, 7, 9, 10 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ సందర్భంగా భర్తీ చేస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో సకాలంలో హాజరు కావాలని ఆమె సూచించారు.