హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరుగురికి ప్రాణదాతగా నిలిచిన ఏడేళ్ల బాలుడు

MDK: హవేలిఘనపూర్ మండలం సర్ధనకు చెందిన లోకినేని రఘు కుమారుడు యాశ్వన్ (7) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. పుట్టెడు దుఃఖంలోనూ తల్లిదండ్రులు గుండె నిబ్బరం చేసుకుని బాలుడి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కంటిపాపలను అవయవ దానం చేశారు. తద్వారా ఆరుగురికి ప్రాణదాతగా, మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి యాశ్వన్ అమరుడయ్యాడు.