హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాల నేపథ్యంలో అప్రమత్తత అవసరం: వైద్యులు

MDK: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ముప్పున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ వైద్యాధికారులు సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీరు తాగుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.